ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా పనిచేసే శ్రీలక్ష్మిగారు, ఏవైనా నియమాలు, పద్ధతులు ఉన్నాయంటే ఆ ప్రక్రియ జోలికి వెళ్ళడం ఇష్టపడని యువతి.2013 లో కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభించిన సుషుమ్న క్రియా యోగ ప్రక్రియ ఆమెలో ఎంత అధ్బుతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుభవాలను, మార్పులను ప్రసాదించిందో తెలుసుకున్నప్పుడు ప్రతి సుషుమ్న క్రియా యోగి ప్రాభావితులు కాక తప్పదు.
ధ్యానము ,విచారణ – ఈ రెండింటిని ఇష్టంగా ఆచరిస్తున్న శ్రీ లక్ష్మి గారికి ,అమ్మగారు తనలో స్థిరంగా ఉండి,అంతరాత్మగా గైడ్ చేస్తున్నారు అనిపించేది ఆమెకు. ప్రతి విషయం ఇలాగే జరగాలి అన్న పంతము, జరగకపోతే బాధ రెండూ తగ్గిపోయాయి.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం,మనుషుల్ని ప్రేమించడం అలవాటైన శ్రీలక్ష్మిగారికి తనకు ఎవరూ శుభాకాంక్షలు వాళ్లంతట వాళ్లుగా ఎందుకు చెప్పరు?!నేను ఎవరికీ అక్కర్లేదా?!అన్న బాధ వుండేది…కానీ ఆమె స్నేహితురాలు ” నువ్వు చేసేది నువ్వు చెయ్యి ఎవరి దగ్గర నుంచి తిరిగి ఆశించకు” అన్న ప్రేమ పూర్వక శాసనం విధించినప్పుడు … స్నేహితురాలి రూపంలో గురువే అలా చెప్పారని భావించి – అదే లక్ష్యంగా సాధన ప్రారంభించారు శ్రీ లక్ష్మి గారు.ఈ ధ్యానంలో చాలా ఉన్నది కష్ట సాధ్యమైన మార్పు అతి త్వరలో తెస్తుంది – అని అర్ధమైంది ఆమెకు.ఆమెనే కాదు ఆమె భర్తకు కూడా స్వప్న దర్శనం ఇచ్చి ఆశీర్వదించిన అమ్మగారి దయ వలన వారు కూడా ధ్యాన యోగిగా మారారు.శ్రీ లక్ష్మి గారిలో “మాతృతత్వము”.. ఎక్కువ… యశోద లాంటి ఆమె వడిలో అమ్మగారు సేద తీర్చుకున్నారు – అన్న స్వప్నం వచ్చినప్పుడు ఆశ్చర్యపోయి అమ్మగారిని అడిగితే “అవును”…అని ఆ ఆధ్యాత్మిక అమృతమూర్తి చిరునవ్వుతో సమాధానమిస్తే నిర్ఘాంతపోయారు శ్రీ లక్ష్మి గారు..ఇది గురువుల ఆత్మీయాశీర్వచనమా?లేక తన తపఃఫలమా?అర్ధం కాలేదు ఆమెకు.ఆమె భర్త భయంకరమైన అనారోగ్యావస్థ నుంచి రక్షించారు అమ్మగారు – జాతక రీత్యా గండం వున్న ఆమె భర్తకు కేవలం అనారోగ్యముతో, అపమృత్యువు అనేది లేకుండా 80%కర్మ రాహిత్యం ఈ యోగం వల్ల జరుగుతుందని మరొకసారి ఋజువు అయింది అంటారు శ్రీ లక్ష్మి గారు. వారి భర్తకు కూడా ఆ విషయం అర్ధమవడం గొప్ప విషయము.శ్రీ లక్ష్మి గారిలో జరిగిన మరొక గొప్ప మార్పు సభా పిరికితనము పోయి,మంచి సుషుమ్న క్రియా యోగ బోధకురాలిగా మారడము.ఈ మెడిటేషన్ వలన చాలా మందిలో ఆత్మ స్థైర్యం పెరగడం గుర్తించారు శ్రీ లక్ష్మి గారు.అమ్మగారు సెలవిచ్చె” కర్మసుకౌశలం” అనుభవములోకి వచ్చింది శ్రీ లక్ష్మి గారికి.8 గంటల పని 4 గంటలలో చెయ్యగలగడం,ఉద్యోగరీత్యా క్రిటికల్ కండిషన్ లో కూడా ప్రశాంతతతో ఉండగలగడము,అందర్నీ ఒత్తిడి పెట్టకుండా పని సాధించుకోవడము – ఇవన్నీ ఈ ధ్యాన ప్రసాదాలే అంటారు శ్రీ లక్ష్మి గారు.సాటి క్రియా యోగులతో ,అమ్మగారి తో హిమాలయాలకు వెళ్ళడము ఒక గొప్ప అనుభవము శ్రీ లక్ష్మి గారికి.దేని గురించీ పెద్ద జ్ఞాపకంగా అనుకోలేని ఆమె ఆ విమానపు టిక్కెట్టు మాత్రము మధుర జ్ఞాపకంగా దాచుకున్నారు.కృష్ణాష్టమి రోజు ధ్యానంలో విపరీతమైన ( ఎనర్జీ ఫ్లో) శక్తి ప్రవాహం అనుభవమౌతోంది ఆమెకు…ముద్ర పెట్టుకున్న అరచేతుల్లో లైటు వెలుగుతున్నట్లు ,అందులో శంఖు చక్రాలు ,శ్రీ వేంకటేశ్వరస్వామి శ్లోకము ,ఆ తరవాత కనుల ముందు రెండు శ్లోకాలు అలా స్క్రోల్ అవుతూ మెరుస్తూ వెళ్లి పోతున్నాయి.చివరగా “ఓం” అన్న అక్షరము నిలబడిపోగా …మెల్లిగా మెడిటేషన్ నుండి బైటకు వచ్చారు ఆమె.
మనలో చాలా మందిమి శ్రీ లక్ష్మి గారి ఆలోచనా విధా నముతో మమేకము అవుతాము..”విచారణ” ద్వారా ఒక మామూలు యువతి ఒక గొప్ప ప్రేమ మూర్తి అయిన సుషుమ్న క్రియా యోగినిగా ఎలా మారవచ్చో శ్రీ లక్ష్మిగారే నిదర్శనము.
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
Welcome to the BLISSFUL journey