అత్యాధునిక నాగరికపు ప్రపంచంలో తిరిగే కార్పొరేట్ యువకులు,సంపాదన స్వేచ్ఛ రెండూ అనుభవించగల అదృష్టవంతులు ఒక రకంగా ఏ విషయాన్ని నమ్మినట్లు నటించక్కర్లేదు వీరు..మరి అటువంటి యంగ్ ఎనర్జిటిక్ యువకులు సుషుమ్న క్రియా యోగులైతే?! అద్భుతాలు జరిగిపోతాయని మోహిత్ గారి కొన్ని అనుభవాలు తెలుసుకుంటూ వుంటేనే అర్థమైపోతుంది .
మోహిత్ గారు సుషుమ్న క్రియా యోగ దీక్ష తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఈ అద్భుతమైన దివ్య దృశ్యాన్ని అమ్మగారి సన్నిధిలో వీక్షించగలిగారు .
మెడిటేషన్ చేస్తూ వుండగా ,అతని శరీరంలో విద్యుత్ ప్రసరిస్తున్నట్లు భావన కలిగింది.సహస్రారచక్రము నుంచి అన్నినరాలకు శక్తిపాతం జరగడం తెలుస్తోంది.వారి సుషుమ్న నాడీ ఎరుపు రంగులో మెరుస్తూ కనిపించింది. ఇడా పింగళ నాడుల్లో కూడా ఈ దివ్య శక్తి ప్రకంపనలు – ఆ శక్తి వెన్నుముక ముందు భాగము నుంచి వెనుక భాగానికి వ్యాపించి పైదాకా ప్రవహించి మళ్లీ వర్తులాకారంలో మూలాధారానికి వచ్చి ఒక పూర్తి వృత్తాన్ని పూర్తి చేసింది.ఆ తరువాత సుషుమ్న పైభాగంలో ఒక బంగారు పద్మము ఇంకా వికసించని స్థితిలో వున్న దృశ్యం కనిపించింది…ఆ తరువాత అతనికి అర్థమైన విషయము ఏమిటంటే…విచ్చుకున్న పద్మము కనిపిస్తే,అది ఆధ్యాత్మిక జ్ఞానానికి,అలౌకిక మైన పరీంగిత జ్ఞానానికి ప్రతీక అని అర్థమైంది..ముకిలిత పద్మం ఇంకా వికసించాలి మరి.
శ్రీశైలము గురు పూర్ణిమకి వీరికి జరిగిన మరొక అనుభవము , సుషుమ్న క్రియా యోగము ఏమి చేస్తుంది?! అన్న విషయానికి గొప్ప ప్రతీక – ఎన్నో వేల జన్మల తపస్సుతో కానీ నిర్మూలించ లేని కర్మ బీజాలు గురుమాత ధ్యానము వలన వాటిని వేళ్ళతో సహా నశింప చెయ్యగలిగారు.
ఆ రోజు ధ్యానము చేస్తూ యోగ నిద్రలోకి జారిపోయిన మోహిత్ సూక్ష్మ శరీరంతో ఒక దట్టమైన అడవిలో ఒక శివలింగాన్ని దర్శించారు.పక్కన కొలనులో స్నానం చేసి స్వామిని అర్చించాలని వస్తూ వుండగా “అమ్మ గారు” దర్శనం ఇచ్చారు.నమస్కరించి మీరు ఇక్కడికి ఎలా వచ్చారమ్మ?!అని అడిగితే,చిరునవ్వుతో అమ్మగారి రెండు పవిత్ర హస్తాలను మోహిత్ తలమీద దీవించినట్లుగా ఉంచి ఆ లింగంలో ఐక్యమైపోయారు.
గురువుకు సర్వవ్యాపకత్వం వుంటుందని తెలిసీ ఆ తెలివి తక్కువ ప్రశ్న ఎలా అడిగానా? అని రెండు మూడు గంటలు దుఃఖ పడుతూ నిద్రలోకి జారిపోయారు మోహిత్ ..అప్పుడు అతడికి స్పష్టంగా ఒక స్వరం – ” నీ పూర్వ జన్మలో ఒకప్పుడు నువ్వు గురువును సంపూర్ణంగా నమ్మలేదు – ఒక విషయములో గురుధిక్కారము జరిగింది.అందుకే ఈ జన్మలో ఆ తప్పుకు పశ్చాత్తాపంగా ఋణము చెల్లించుకుంటున్నావు”అన్న మాటలు వినపడ్డాయి.దీర్ఘ నిద్రలోకి జారిపోయిన మోహిత్ తను 15 గంటలు ఏక ధాటిగా నిద్రపోయానన్న విషయం 22 ఫోన్ కాల్స్ ,11మెసేజ్ లు వగైరా చూడగానే అర్థమైంది.
అమ్మగారికి ఈ విషయం చెప్పగానే నువ్వు చూసింది కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి శ్రీశైలము కర్మ బీజాలు తొలగడము కష్టము…కానీ గురువులు నిన్ను 15 గంటల యోగ నిద్రకు పంపి నీలో కర్మ బీజాలను కొన్ని వేల సంవత్సరాల నాటివి,కొన్ని వందల సంవత్సరాల తపస్సుకు కానీ నాశనము కానివి తీసి వేశారు – అని చెప్పారు
గురువు అనుగ్రహము ఉంటే జరగనిది ఏముంటుంది?!.l
About Sushumna Kriya Yoga
Recent Posts
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
Welcome to the BLISSFUL journey