Welcome to the BLISSFUL journey

Day 43- పవిత్ర గౌరి శంకర్ పీఠం రహస్యాలు

0
బాబాజీ గారు తమ 49 శిష్యులతో కలసి విశ్వ కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. గౌరి శంకర్ పీఠానికి చేరటం సామాన్య మానవుల తరం కాదు.ఆ ప్రదేశానికి వెళ్ళటానికి చాలా యోగ శక్తి కావాలి. అమ్మగారు తమ దివ్యానుభవాన్ని ఇలా చెప్ప సాగారు “హిమాలయాల్లో అన్నీ ఎత్తైన శిఖరాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ప్రదేశం మాత్రం సమ స్థితిలో ఉంది. చాలా పచ్చగా ఉంది. సామాన్య మానవులు ఎవరైనా అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తే, ఆ ప్రాంతానికి 360 యోజనాల దూరం నుండి ఆ వ్యక్తి మార్గం మళ్ళించబడుతుంది. ఆశ్రమం చుట్టూరా ఒక శక్తి రేఖ కవచంలా రక్షణగా ఉంటుంది. ఆ శక్తిని దాటి సామాన్యులెవ్వ రూ అడుగు పెట్టలేరు. ఆ ప్రాంతం రాత్రివేళలో కూడా కాంతిమంతంగానే ఉంది. అక్కడ ఉన్న శిఖరానికి కొద్దిగా కింద, సహజంగా ఏర్పడిన గుహలు ఉన్నాయి.
ఆ శిఖరం కుడి వైపున, చిన్న శివ లింగం దర్శనమిస్తుంది. ఆ మరకత శివలింగానికి నిరంతరాయంగా అభిషేకం జరుగుతుంటుంది. ఆ పవిత్రమైన జలధారకు ఏ ఆధారం కనిపించదు. సన్నటి నీటిధార శివలింగాన్ని అభిషిక్తం చేసి, కిందకు ప్రవహిస్తుంది. శివలింగానికి ముందు భాగంలో ధుని మండుతుంటుంది. ఆ ధుని నుండి వచ్చే వాసన, వేప కట్టెల్ని కాల్చినప్పుడు వచ్చే చేదు వాసనలా ఉంటుంది. శివలింగానికి కొద్దిగా ఎడమ భాగంలో ఒక పెద్ద రాతి పీఠం వంటిది ఉంది. అది మానవులు నిర్మించింది కాదు. సహజంగానే ఏర్పడిన రాయి అది. అక్కడే శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు కూర్చొని ఉంటారు…….
Share.
Leave A Reply