హర్షిల్ నుండి గంగోత్రికి ఆ రోజు ఉదయమే మా ప్రయాణం. గంగోత్రికి వెళ్లే సమయంలో అమ్మగారు అందర్నీ, మౌనంతో, భావంతో ఉండమన్నారు. మౌనంగా ఉండటం అంటే మౌన వ్రతం లాగానేమో అనుకున్నాం. కొన్ని గంటల పాటు ప్రయాణం సాగిన క్రమంలో ఆ రోజు ఉదయం అమ్మగారు మౌనంగా ఉండమన్న సంగతి విస్మరించారు మాలో కొందరు. మార్గం మధ్యలో ఉత్తర కాశీలోని శివాలయానికి అమ్మగారితో పాటుగా అందరం లోపలికి వెళ్ళాం. గర్భ గుడిలోని శివ లింగం పక్కన కూర్చున్న అమ్మగారు ధ్యానం చేయ సాగారు. మేమంతా కూడా గుడి లోపల కాసేపు ధ్యానించి గుడి బయట ఉన్న ఉపాలయాల్ని సందర్శిస్తున్నాం. ఆ గుడిలోనికి నడుస్తున్నప్పుడు కానీ, బయటకు వస్తున్నప్పుడు కానీ అమ్మగారు ఎవ్వరితో మాట్లాడటం లేదు. పూర్తి మౌనంలో ఉన్నారు