Welcome to the BLISSFUL journey

Day 15 – పంచ ప్రమాణాలు

0

ప్రకృతి మాత అయిన శ్యామల దేవి, రమణీయ సొబగులతో ఆ ప్రాంతానికి రా రమ్మని తమబిడ్డలైన మమ్మల్ని.   పిలుస్తున్నట్లు అనిపించింది. ఆ చోటికి వెళ్ళటానికి ముందు, పైకి కాస్త ఎత్తుగా ఉంది. అయితే చెప్పులు వేసుకొని ఎక్కటం కుదరలేదు, దాంతో చెప్పులు చేత పట్టుకొని ఆడవారమంతా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ పైకి ఎక్కాం. అమ్మగారు చాలా అనాయాసంగా ఎక్కేశారు. పరమ గురువుల చిత్ర పటాలు ఏర్పరిచిన చోటికి చేరాం.అడవి ప్రాంతం, అందునా సమీపంలో నది ప్రవహిస్తుండటంతో అక్కడ మట్టి, రాళ్ళూ, బురద ఉన్నాయి. అమ్మగారు అందరినీ వృతాకారంలో కూర్చోమన్నారు. వెంట తెచ్చుకున్న రుమాలు, న్యాప్కిన్లు వేసుకొని వాటిపై కూర్చున్నాం.అమ్మగారు  మమ్మల్ని   అక్కడికి ఎందుకు   రమ్మన్నారో   అక్కడికి వెళ్లేంత వరకు కూడా మాలో ఎవ్వరికీ   తెలియదు. అమ్మగారు ధ్యానం ప్రారంభించే ముందు ఎవ్వరినీ కళ్ళు తెరవద్దని సూచించారు. అలాగే మా అందరితో కొన్ని ప్రమాణాలు చేయించారు. అమ్మగారు   ప్రమాణాలు చేయించటం అదే తొలిసారి. “సుషుమ్న క్రియా యోగ గురువుల పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటామని, మాకు ఇవ్వబడిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తామని, తోటి క్రియా యోగులను గౌరవిస్తామని, దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ కు నష్టం కలిగే పనులు ఎన్నటికీ చేయబోమని, ప్రతీ క్షణము మోక్షమే తపనగా బతుకుతామని” ప్రమాణం చేయమన్నారు. వీటికి కట్టుబడి మానసా, వాచా, కర్మణా ఈ సూత్రాలను పాటించాలనుకున్న వారిలో మాత్రమే గురువులు చేయబోతున్న ప్రక్రియ జరుగుతుందని చెప్పారు అమ్మగారు. ఆ తరువాత ధ్యానంలో లీనమవుతుండగా ఒక్కసారిగా ఉదృతంగా గాలి మొదలైంది. ఏంటో చూడటానికి అమ్మగారు కళ్ళు తెరవద్దన్నారు. అమ్మగారి ఆజ్ఞానుసారం ఎవ్వరం కళ్ళు తెరవలేదు. కాసేపటికి ఉదృతంగా వీచిన ఆ గాలి శాంతించింది. పూర్తి నిశ్శబ్దం. ధ్యానం పూర్తి అయ్యాక అమ్మగారు కళ్ళు తెరవమన్నారు. అమ్మగారు పైకి లేచి అక్కడున్న పెద్ద పెద్ద దేవదారు వృక్షాల దగ్గరకు వెళ్లి, తమ కర కమలాలతో ఆ చెట్లను తడుముతూ, ప్రేమగా మాతృ మూర్తి పసి పాపల తలలను నిమురుతున్నట్లు స్పృశిస్తున్నారు. మాకు ఏమి అర్ధం కాలేదు.ఇంతలో ఎటవాలుగా ఉన్న ప్రదేశంలో మరికొన్ని వృక్షాలు ఉండటంతో, అమ్మగారు లోతుకు దిగుతున్నారు. చాలా బురద, తడి ఉండటంతో జారిపోతారేమోనని గుండెలు గుభిల్లుమన్నాయి

Share.
Leave A Reply