ముస్సోరీ DRDO లో సుషుమ్న క్రియా యోగ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యువ బృందంలో సభ్యులను ఏర్పాట్లు చేయమన్నారు అమ్మగారు. దీక్షా కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రిని కూడా సిద్ధం చేశారు. ప్రయాణానికి ఒక నెల రోజుల ముందు నుండే ఎప్పుడెప్పుడు హిమాలయ యాత్రకు వెళతామా? అని ప్రతీ ఒక్కరం ఆతృతగా ఎదురు చూశాం. రోజు ఒక యుగంలా గడిచింది. ఏ పని చేసినా హిమాలయ యాత్రను గురించే ఆసక్తి. అప్పటి వరకు మేము ఎవ్వరం కూడా అన్ని రోజుల పాటు అమ్మగారి సమక్షంలో ఉండటం సంభవించలేదు. హిమాలయ యాత్రకు పిలుపు అందుకున్న యువ బృందానికి మాత్రం అమ్మగారితో అన్ని రోజులు యాత్ర సాగిస్తూ, వారి సాన్నిధ్యంలో ఉండటం అదే మొదటి సారి. అందుకే ఒక పక్క ఉత్సాహం, ఉద్వేగం, ఆనందం మిళితమైన స్థితి అందరం అనుభవించాం. పరమ గురువులు శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారు, శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారి పరిపూర్ణ కటాక్షం వల్ల, మా ప్రత్యక్ష గురువులైన ఆత్మానందమయి అమ్మగారితో హిమాలయ యాత్ర చేసే మహదావకాశం దక్కిందని అంతా ఆనందించాం.చాం.