Welcome to the BLISSFUL journey

49 రోజుల ఆధ్యాత్మిక క్లేశ నిర్మూలన విధానం – వారం 2

0

ఈ వారం, మేము అందించే చిట్కాలు, క్రియల ద్వారా, అధిక మూత్ర విసర్జనం, శరీరంలో నీటి  సమతౌల్యం లేక ఇబ్బందులు ఎదుర్కొనే డిటాక్స్ పద్ధతిని మీకు అందిస్తున్నాం. క్రమం తప్పక ఈ ప్రక్రియలను పాటించండి. ఇంటి వద్ద లభించే ఔషధ విలువలున్న పదార్ధాలను వినియోగించి చేసేటువంటి ఈ సులువైన ప్రక్రియ ద్వారా ఎన్నో రోగాలు సైతం దరికి రాకుండా శరీరాన్ని, మనసును, మన అధీనం లో పెట్టుకోవచ్చు.

 
  • జీలకర్ర
    జీలకర్రను భారతీయులతో పాటుగా ఈజిప్శీయులు కూడా అనేక రకాల ఆధ్యాత్మిక సాధనల కోసం వినియోగించేవారని ప్రతీతి. జీలకర్ర ప్రస్థావన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా మనకు దర్శనమిస్తుంది. రక్తాన్ని పరిశుభ్ర పరచటంలో, ఆరోగ్యమైన కణ ఉత్పత్తి జరగటానికి దోహదం చేస్తుంది జీలకర్ర. తరతరాలుగా మనం వినియోగిస్తున్న జీలకర్ర మాహాత్మ్యం ఎరిగి జీలకర్ర వంటి దివ్య ఔషధాన్ని నీటిలో మరిగించి స్వీకరిద్దాం.
  • దాల్చిన చెక్క
    దాల్చిన చెక్క ఔషధ గుణాల ద్వారా దేహంలో నాడీమండల కూడళ్లలో ఏర్పడే ఆటంకాల వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల కలిగే శరీర దుర్వాసనను దూరం చేసే లక్షణాలు ఉన్నాయి. శరీరం, మనసు, ఆత్మ సంయోగం ద్వారా ధ్యానంలో తొందరగా లయం కావచ్చు. ధ్యానం ద్వారా మృత కణాల సంఖ్యను గణనీయంగా తగ్గించి దేహం నుంచి సుగంధం ఉత్పన్నం అయ్యేలా కూడా చెయ్యవచ్చు.
  • లవంగం
    ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో ముఖ్యమైన మార్పులు సంభవించేవి మెదడులోనే. మెదడుకు మేరుదండానికి సంబంధం అందరికి తెలుసు. మెదడుకు ఉత్తేజవంతమైన శక్తిని కలిగించి అద్భుత ఫలితాలు అందించగల దివ్య గుణం లవంగంలో ఉంది. చూసేందుకు చిన్నదిగా కనిపించే లవంగం లెక్కలేనన్ని ఔషధ గుణాల సంగమం.

మిరియాలు
మిరియాలు జీర్ణ కోశాన్ని సమర్ధవంతంగా పనిచేసేలా చేయగలవు. జీర్ణానికి కావాల్సిన ద్రవాలను తయారుచేసి ఆకలి, జీర్ణం సరిగ్గా జరిగేలా చేస్తాయి. సౌర శక్తిలో ఎటువంటి గుణం అయితే ఉంటుందో జఠరాగ్ని ద్వారా తిన్న ఆహారాన్ని మెరుగ్గా జీర్ణం చెయ్యగల శక్తి మిరియాల్లో ఉంటుంది.

Day 8

Day 9

Day 10

Day 11

Day 12

Day 13

Day 14

 

Share.
Leave A Reply