ఈ వారం చిన్న విషయాలకు ఆవేశ పడటం, అధికంగా ఆలోచించటం, దుర్వార్తలు విన్నప్పుడు మానసిక అదపును కోల్పోవటం, గుండె ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచి, గుండె నిండా ఊపిరి తీసుకోగల అద్భుత ప్రక్రియ అందిస్తున్నాం. క్రమం తప్పక ఈ ప్రక్రియలను పాటించండి. మీ పరిపూర్ణ ఆరోగ్యానికి మరో అడుగు ముందుకు వెయ్యండి.
- మునగాకు
మునగాకు కడుపులో మంటను చల్లార్చి ఉపశమనం ఇస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించి హృత్ సమస్యల నుంచి కాపాడుకునేలా చేస్తుంది. అధికమైన బరువు, పొట్ట ఉన్న వారు సరైన శరీర వ్యాయామంతో పాటు మునగాకును నీటిలో మరిగించి తీసుకోవచ్చు. - కరివేపాకు భారత దేశంలో ప్రతి మూల విరివిగా వినియోగించే మహత్తర ఔషధ గుణాలున్న కరివేపాకును పూజ విధానాల్లో కూడా తులసి ఆకు అందుబాటులో లేని పక్షంలో వినియోగిస్తారు. బలమైన కేశాలు కోసం కర్వేపాకు చాలా మంచిది. మధుమేహం, హానికారక కొవ్వును కూడా నివారించగల అద్భుత గుణాలున్న కర్వేపాకు ఆకు ఎంతో మేలు చేస్తుంది.
- కొబ్బరినీళ్లు మణిపూరక చక్రంలో బలమైన బీజాలు దురలవాట్లు. హానికారక రసాలు, మద్యం వంటివి సేవించటానికి బదులుగా కొబ్బరి నీళ్లు అలవాటు చేసుకొని, ధ్యాన సాధన చెయ్యటం వల్ల క్రమంగా దురలవాట్లు దూరమై ఆరోగ్యకరమైన జీవనం మన సొంతం కాగలదు. కాలేయన్నీ ప్రక్షాళన చేసి శరీరమంతా పరిశుభ్రపరిచే గుణం కొబ్బరి నీటిలో ఉంది.
Day 22
Day 23
Day 24
Day 25
Day 26
Day 27
Day 28








