వీక్ 1
ఈ వారం శరీరంలో నిల్వ ఉన్న విషపూరిత వ్యర్థాలను బయటకు పంపే క్రమాన్ని మనకి అందించారు. సూర్య నమస్కారాలు, దీర్ఘశ్వాసాలు,ఔషధ విలువలున్న పదార్ధాల ద్వారా ఎంతో కాలంగా పేరుకున్న వ్యర్థాల తొలగింపులో భాగంగా జీర్ణం, జీవక్రియ మెరుగ్గా పనిచేసి, మానసికంగా సమతౌల్యం కలుగుతుంది. ఈ వారం అందించబడిన క్రియలను తప్పక పాటించండి.
- ఓంకారం
ఓంకారం మహామంత్రం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. ఈ ప్రణవ నాదాన్ని నాభి నుంచి ఉచ్ఛరించినప్పుడు బీజ రూపంలో ఉన్న జన్మ వాసనలు, జ్ఞాపకాలు, కామ, క్రోధ, లోభ, మద, మాశ్చర్యాలు సాధనకు అడ్డంకులుగా నిలవకుండా, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ బీజాలు విష వృక్షాలుగా మారి విజృంభించకుండా ఉండటానికి నాభి స్థానం నుంచి ఓంకారం చెయ్యాలి. ఇలా ఓంకారం చెయ్యటం వల్ల ధ్యాన సాధన కూడా సుగమం అవుతుంది. అన్ని మంత్రాలకు ఆది, పునాది ఓంకారం. - శ్వాస
శ్వాస మానవ శరీరలైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను బంధించే సూత్రం. శ్వాస లేనిదే ఈ జగతి లేదు. దీర్ఘ శ్వాస ద్వారా అంతః క్లేశములు తొలగిపోతాయి. శ్వాస లోపలికి తీసుకున్నపుడు ఆరోగ్యం, ఆనందం, ధైర్యం, విజయం ఇంకా ఎన్నో సత్ గుణాలు కావాలని భావం చేస్తే గురువులు అనుగ్రహిస్తారు. శ్వాస విడిచేటప్పుడు ఏ గుణాలు, లక్షణాలు మన జీవితానికి అవాంతరాలుగా ఉన్నాయో వాటిని విడిచి పెడుతున్నట్లు భావం చేస్తూ శ్వాసను విడవాలి. - సూర్యుడిని సూర్యభగవానుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. ఎందరో యోగులు సూర్య రశ్మి కారణంగా వందల సంవత్సరాలు శరీరాన్ని నిలుపుకున్నట్లు గాధలు ఉన్నాయి. సూర్యుడి బంగారు కాంతికి మానవ సహస్రారంలో ఉన్న రహస్య ఆధ్యాత్మిక గ్రంథికి సంబంధం ఉండటం వల్ల సూర్యోదయ సమయంలో అధికమైన శక్తి ప్రకంపనలు ఆ ప్రదేశంలో కలుగుతాయి. భక్తి ప్రపత్తులతో సాక్షాత్ గురు స్వరూపంగా భావించి సూర్యుడికి నమస్కారం చెయ్యండి.
- బిల్వ పత్రం
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా భాసిల్లే బిల్వ పత్రం అత్యంత పవిత్రమైనది. పరమ శివుడి స్వరూపంగా కొలిచే ఈ బిల్వపత్రం, ఔషధ గుణాలతో పాటు శక్తి శరీరంలో మార్పులు కలగటానికి కారణం అవుతుంది. భగవత్ జ్ఞానం కలిగించే ఆజ్ఞ చక్రాన్ని సూచించే ఈ దళం శ్వాస లో కలిగే ఇబ్బందులను, దోషాలను నివారించగలదు. - తులసి
పరమగురువులైన శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారి గౌరి శంకర్ పీఠం లో సైతం దర్శనమిచ్చే పవిత్రమైన మొక్క తులసి. తులసిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లాభాలు కలిగించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటం వల్లే తులసి ఆకులను దేవాలయాల్లో కూడా తీర్థంగా ఇస్తారు. విషపూరితమైన గాలిని కూడా శుద్ధంగా మారుస్తుంది తులసి. తులసి ఆకులను ప్రకృతి మాత అందించిన దివ్య ఔషధంగా భావించి ఈ ఆకులను మరిగించి స్వీకరించండి. - వేప:
శక్తి స్వరూపంగా భావించే వేప వృక్షమే దేవీ అవతారంగా కొలుస్తారు. ఎంతటి మలినమైనా ఎదుర్కొని దేహానికి రోగ నిరోధక శక్తి ని ప్రసాదించే దివ్యమైన వృక్షం వేప. ప్రకృతి మాత ప్రసాదంగా భావించి వేప ఆకులను మరిగించి స్వీకరించండి. - పసుపు:
పసుపు అంటే శుభం. వాయువులో, నీరులో, పృథ్విలో సంభవించే కాలుష్యాల కారణంగా ఏర్పడే దోషాలను నయం చేసి పంచ కోశాలలో సమతుల్యాన్ని ముఖ్యంగా ప్రాణ శక్తి ప్రవహించే కంటికి కనిపించని నాడీ కూడళ్లలో శుద్ధి చేస్తుంది పసుపు..
Day 1:
Day 2:
Day 3:
Day 4:
Day 5: