Welcome to the BLISSFUL journey

21 నిముషాల సుషుమ్న ధ్యాన పద్ధతి

0
శక్తి, సామర్ధ్యం, పెంపొందించగల 21 నిమిషాల పద్ధతిని మీరు పాటించండి. ఇది సకల రోగ నివారిణి, సకల భోగ కారణి, జీవన్ ముక్తి ప్రదాయిని.
ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవ్వరు మీ  ధ్యానానికి భంగం కలిగించని ప్రదేశంలో కూర్చోండి. సెల్ ఫోన్ ను సైలెంట్ లో ఉంచండి. ఇప్పుడు 21 నిమిషాలకు అలారం లేదా టైమర్ పెట్టండి.
వెన్నుముక నిటారుగా వుండే విధంగా కుర్చీలో గాని, సోఫా పైగాని, చాప వేసుకొని నేలపై కానీ కూర్చోండి. కింద చూపిన విధంగా చేతులను యోగ ముద్రలో ఉంచండి.
కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఓంకారాన్ని 21 సార్లు దీర్ఘంగా ఉచ్ఛరించండి. ఓ ఒక ఇంతైతే మ మాత్ర దీర్ఘంగా పలికే విధంగా ఓంకారాలు చెయ్యండి.
ఇప్పుడు 14 సార్లు దీర్ఘంగా శ్వాసలు చెయ్యండి. శ్వాస చేసే తప్పుడు ఆరోగ్యాన్ని తీసుకుంటున్నట్లు భావన చెయ్యండి, లేదా ఆనందం మొదలైనవి. శ్వాస విడిచి పెట్టేటప్పుడు అనారోగ్యం, బాధ, భయం, దుఃఖం మొదలైనవి విడిచి పెడుతున్నట్లు భావన చేస్తూ విడిచి పెట్టండి.
ఇప్పుడు భృ మధ్యం లో దృష్టి పెట్టి హాయిగా ధ్యానంలో లయం కండి.
ధ్యానం మన నిత్య జీవితానికి కావాల్సిన శక్తిని అందించే ప్రక్రియ. నిరంతరం అధునాతన మానవుడు ఎదుర్కొనే ఎన్నో రకాల ఒత్తిడిల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ధ్యానం. ధ్యానం నిద్రాణ అవస్థ లో ఉన్న” ఉప- చేతన” అంటే సబ్ కాన్షియస్ మైండ్ ను తట్టి లేపి, లోపల దాగి ఉన్న చైతన్య శక్తిని అధికం చేస్తుంది.
ధ్యాన పద్ధతి ప్రయోజనం
ఈ పద్ధతి వైశిష్ట్యం ఏమిటంటే ఇందులో
ముద్ర తో చేసే ధ్యానం,నాదం అంటే ఓంకారం ద్వారా చేసే ధ్యానం, శ్వాస ద్వారా చేసే ధ్యానం,  భృ మధ్యంలో దృష్టి నిలిపి చేసే ధ్యాన పద్ధతులన్నీ ఉన్నాయి. ఎన్నో ప్రయోజనాలను ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఈ ధ్యాన సాధన ద్వారా పొందారు. రండి, మీ ఆరోగ్యమే మా భాగ్యం. ఈ అద్భుత సాధన చెయ్యండి, మీ జీవితాన్ని, సుఖమయం, సౌఖ్యమయం , ఆనందమయం చేసుకోండి.
Share.
Leave A Reply